Pawar Parivar | మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేండ్ల క్రితం విడిపోయిన ‘పవార్’ కుటుంబం (Pawar Parivar) స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar), శరద్ పవార్ ఒక్కటయ్యారు. త్వరలో జరగబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ)-ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి.
ఈ విషయాన్ని అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించారు. ‘పవార్ పరివార్ (కుటుంబం) మళ్లీ కలిసింది’ అని ప్రకటించారు. జనవరి 15న జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు జరుగుతోందని తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంపై దృష్టిపెట్టాలని సూచించారు.
కాగా, ఇప్పటికే ఠాక్రే సోదరులు కలిసిపోయిన విషయం తెలిసిందే. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమయ్యారు. విభేదాలతో విడిపోయిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బుధవారం ఒకే వేదికపై కన్పించారు. వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు పవార్ ఫ్యామిలీ కూడా ఒక్కటి కావడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైలు సేవలపై ప్రభావం.. రెడ్ అలర్ట్ ఇష్యూ చేసిన ఐఎండీ
Rabies | రేబిస్తో గేదె మృతి.. భయంతో 200 మంది గ్రామస్తులకు వ్యాక్సిన్లు