Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభ స్పీకర్ పదవి అనేది పార్టీకి సంబంధించింది కాదని, ఇది సభా నిర్వహణకు సంబంధించిన అంశమని మంత్రి పేర్కొన్నారు.
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఆనవాయితీ అని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ స్పీకర్ పదవికి తమ అభ్యర్ధిని బరిలో నిలిపిందని చెప్పారు. స్పీకర్ పదవికి ఇప్పటివరకూ ఎన్నడూ ఎన్నిక జరగలేదని గుర్తుచేశారు.
తమకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయిస్తే తాము ఎన్డీయే స్పీకర్ అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ షరతు విధించిందని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సరైంది కాదని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. షరతుల ఆధారంగా ప్రజాస్వామ్యం నడవదని స్పష్టం చేశారు.
Read More :
Nivetha Thomas | నీ వేదనేంటి నివేదా..? ఆ అక్షరాలకు అర్థమేంటి?