మంచిర్యాల, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది. హంగ్ ఉన్నప్పటికీ ఈ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం సుస్పష్టమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది మున్సిపాలిటీల్లో ఐదు చోట్ల బీఆర్ఎస్కు తిరుగులేకుండా పోయింది. ఈ ఐదు మున్సిపాలిటీలతోపాటు మ రో మూడు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ అధికార కాం గ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో పరిశీలిస్తే.. మొత్తంగా ఎనిమిది ము న్సిపాలిటీల్లో గులాబీ డామినేషన్ కండ్లకు కడుతున్నది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ అధికార పార్టీకి దీటుగా జనం బీఆర్ఎస్ను ఆదరించారు. దీంతో ఉమ్మడి జిల్లా జనం గుండెల్లో కేసీఆర్ పార్టీ చెరగని ముద్ర వేసింది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 30 వేల ఓట్లు సా ధించి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి సత్తా చాటింది. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్ మూడు మున్సిపాలిటీల్లో మాత్ర మే బీజేపీ ఎక్కువ ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇవి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పడిన ఓట్ల గణాంకాలను నిశీతంగా పరిశీలిస్తే.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీతో దాదాపు సమానమైన ఆదరణ ఉన్నట్లు అవగతమైపోతున్నది. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టమైపోతున్నది.
ఉమ్మడి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ కంటే అత్యధిక ఓట్లు సాధించింది. బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు 10,724 ఓట్లు వస్తే.. బీఆర్ఎస్కు 10,777 ఓట్లు.. కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 8,066 ఓట్లు వస్తే.. బీఆర్ఎస్కు 11,806 ఓట్లు.. క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్‌కు 8044 ఓట్లు వస్తే.. బీఆర్ఎస్, సీపీఐ బలపరిచిన అభ్యర్థులకు 11,866 ఓట్లు వచ్చాయి. మరో రెండు చోట్ల హస్తం పార్టీకి బలమైన పోటీ ఇచ్చింది. ఆసిఫాబాద్, ఖానాపూర్‌లో అధికార పార్టీకి ఏ మాత్రం తగ్గకుండా సీట్లు సాధించిన కారు పార్టీ లక్షెట్టిపేట, చెన్నూర్ మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చింది.
జిల్లాలవారీగా చూసుకుంటే.. ఆసిఫాబాద్ జిల్లాలోని రెం డు మున్సిపాలిటీల్లో అధికార పార్టీని తోసిరాసి బీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 11,525 ఓట్లు వస్తే.. బీఆర్ఎస్ పార్టీకి 15,226 ఓట్లు వచ్చాయి. బీజేపీ 8,636 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్ఎస్కు ఓ ట్లు పడ్డాయి. ఈ జిల్లాలో 83,892 ఓట్లు కాంగ్రెస్‌కు రా గా, బీఆర్ఎస్కు 55,679 ఓట్లు వచ్చాయి. 32 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న భైంసా, నిర్మల్ మున్సిపాలిటీల్లో రెండో స్థానానికి పరిమితమైంది.
భైంసాలో ఎంఐఎం, నిర్మల్‌లో కాంగ్రెస్ తొలిస్థానాల్లో ని లిచాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మూడు ప్రధాన పార్టీలకు దాదా పు సమానమైన ఓట్లు వచ్చాయి. బీజేపీకి 28,447 ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 25,487, బీఆర్ఎస్కు 18,103 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాలిటీల్లో ఐదు చోట్ల బీఆర్ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, ఒక మున్సిపాలిటీలో ఎంఐఎం స్పష్టమైన ఆధిక్యంతో ఉన్నాయి. బీఆర్ఎస్ దాదాపు ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాలు సాధించడం గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది.
