Nivetha Thomas | బొద్దుగా ముద్దుగా చూడముచ్చటగా ఉంటుంది కేరళకుట్టి నివేదా థామస్. తెలుగులో కూడా ఈ అందాలభామకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. తారక్, నాని లాంటి స్టార్ హీరోలతో జతకట్టి విజయాలను అందుకున్నది నివేద. నటన, నాట్యం, గానం.. ఇలా బహుకళాప్రావీణ్యం నివేద థామస్ సొంతం. ప్రస్తుతమైతే ఈ మలయాళ మందారం చేతిలో సినిమాలేం లేవు. అయితే.. ఇన్‌స్టాలో మాత్రం ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది నివేదా.
తన సోదరునితో కలిసి రీల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే.. రీసెంట్గా ఎక్స్(ట్విటర్)లో తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ‘కొంతకాలం గడిచింది.. కానీ.. చివరిగా!’ అంటూ నర్మగర్భంగా పోస్ట్‌లో అక్షరాలను పొందుపరిచింది నివేద.. ఈ అక్షరాలకు అర్థమేంటి? ఎట్టకేలకు సినిమా చేస్తున్నాననా? లేక చివరి సినిమా చేస్తున్నాననా? లేక పెళ్లిపీటలెక్కుతున్నాననా? అర్థం కాక, నెటిజన్స్ జుత్తు పీక్కుంటున్నారు.