Amangal : జాతీయస్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ.. నీచ రాజకాయాలకు తెరలేపాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకునేందుకు అడ్డదారిలో కుమ్మక్కయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మున్సిపాలిటీలో అధికారం కోసం అక్రమ పొత్తు పెట్టుకున్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్ల దన్నుతో బీఆర్ఎస్ దక్కాల్సిన అధికారాన్ని తమవైపు లాక్కునేందుకు కుట్ర పన్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 8 వార్డులు దక్కాయి. బీజేపీ 6 వార్డుల్లో గెలువగా, కాంగ్రెస్ ఒక్క వార్డుకే పరిమితమైంది.
దాంతో న్యాయంగా అయితే ఆమనగల్ మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీకి దక్కాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్కు అధికారం దక్కకుండా చూసేందుకు కాంగ్రెస్, బీజేపీలు అక్రమపొత్తుకు పూనుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి రూపంలో రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. ఆ ప్రకారం కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 3కు పెరుగుతుంది. ఆ ముగ్గురికి ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు జతకలిస్తే మొత్తం ఓట్ల సంఖ్య 9కి చేరుతుంది.
దాంతో 8 మంది కౌన్సిలర్లు కలిగిన బీఆర్ఎస్కు అధికారం దూరం అవుతుంది. ఈ కుట్రతోనే కాంగ్రెస్, బీజేపీలు అక్రమపొత్తు పెట్టుకున్నాయి. ఇందుకోసం బీజేపీ పూర్తిగా దిగజారింది. తనకు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నా ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్కు ఛైర్మన్ పదవి వదులుకునేందుక అంగీకరించింది. వైస్ ఛైర్మన్ పదవి దక్కినా చాలన్నట్లు వ్యవహరించింది. కేవలం బీఆర్ఎస్కు ఛైర్మన్ పదవి దక్కొద్దన్న దుర్బుద్ధితో రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య కుదిరిన ఈ అక్రమ పొత్తుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫాల్తూ ల*జ కొడుకు అంత కష్టపడి ఓట్లు వెపిస్తే ఎలా అమ్ముడు పోతాడు
కాంగ్రెస్, బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పై మండిపడుతున్న ఓటర్లు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడుపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పత్య నాయక్ డౌన్ డౌన్ అంటూ… https://t.co/X7KOX8hMsj pic.twitter.com/lVU42NFZDN
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2026