– వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 16 : ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ మున్వర్ అలీ ఆధ్వర్యంలో తొలుత 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో చైర్ పర్సన్ ఎన్నిక లాంచనమైంది. చైర్‌పర్సన్‌గా 23వ వార్డు కౌన్సిలర్ పోకబత్తిని అనితను కౌన్సిలర్లు ఎన్నుకోగా వైస్ చైర్మన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ తమ్మినేని నవీన్ ను మెజారిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రమాణ స్వీకారం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు నిర్వహించారు. బీఆర్ఎస్, సిపిఎం కూటమికి సంబంధించిన వార్డు కౌన్సిలర్లు పెరుమల్లపల్లి మరియమ్మ. మొరిమేకల సత్యనారాయణ, హైమావతి, మల్లయ్య తొలుత కలిసి రాగా అనంతరం కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు ఆ తర్వాత ముగ్గురు వార్డు కౌన్సిలర్లు ఒక స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత