మహాశివ రాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. వేలాల, బుగ్గ, కత్తెరశాల, వాంకిడి, ఈజ్గాం, కదిలి, గొడిసెర్యాల, సిరిచెల్మ, బాబాపూర్, బూర్గుపల్లి, కుంటాల తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలివస్తుండగా, ఆయా కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
అంగరంగ వైభవంగా శివ పార్వతుల కల్యాణం నిర్వహించ నుండగా, స్వామి వారి నామస్మరణంతో దేవాలయాలు మారుమోగనున్నాయి. ఉపవాస దీక్షలతో రాత్రంతా జాగరణ చేసి త్రినేత్రుడిని పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది.