Mallikarjun Kharge : గాంధీ సినిమా వెలుగుచూసేంత వరకూ మహాత్మ గాంధీ గురించి ప్రపంచానికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే భగ్గుమనగా తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు.
ప్రధాని మోదీ గుజరాత్ వ్యక్తని, గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికే మహాత్మ గాంధీ తెలియదని, గాంధీని ప్రేమించలేదని అంటే ఇక ఏం చేస్తామని ఖర్గే పేర్కొన్నారు. ఆరెస్సెస్ సభ్యులుగా ఉంటూ మీరు ఆ సంస్ధ సిద్ధాంతం, భావజాలం, ఆశయాలను ప్రచారం చేశారు కానీ మీరు మహాత్మ గాంధీ కోసం ఏమీ చేయలేదని మోదీని ఉద్దేశించి అన్నారు.
మీరు గుజరాత్‌కు 13 ఏండ్లు సీఎంగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధానిగా గత 23 ఏండ్లుగా గాంధీ కోసం మీరు ఏం చేశారని నిలదీశారు. మీరు గాడ్సేతో ఉండటాన్నే ఇష్టపడతారు కానీ మహాత్మ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మీకు ఆసక్తి లేదని ఖర్గే వ్యాఖ్యానించారు.
Read More :
Electric Shock | ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్..