Electric Shock | ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్..
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ్ భార్యా భర్తలు. వారికి 14 ఏండ్ల కుమారుడు ఉన్నాడు.
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్ (Electric Shock) పెట్టి చిత్ర హింసలకు గురిచేసిందో మహిళ. మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్, ప్రదీప్ సింగ్ భార్యా భర్తలు. వారికి 14 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బేబీ యాదవ్ గత కొంత కాలంగా ఫోన్‌తో ఎక్కువ కాలం గడుపుతున్నది, ఓ వ్యక్తితో గంటల తరబడి మాట్లాడుతున్నది. దీంతో ఆమెను అతడు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఫోన్ తీసుకోవాలని వారు సలహా ఇచ్చారు.
అత్తవారింటి సూచన మేరకు ఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. దీంతో ప్రదీప్ సింగ్‌పై ఆగ్రహంతో ఉన్న ఆమె.. అదను చూసి గతవారం అతనికి మత్తుమందు ఇచ్చింది. అనంతరం మంచానికి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు కరెంట్ షాక్ పెట్టింది. అడ్డుకోబోయిన తన కుమారుడిపై కూడా దాడి చేసింది. అయితే ఎలాగోలా అమె నుంచి తప్పించుకున్న ప్రదీప్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఆమెకోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

