Azam Cheema | 26/11 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి
Azam Cheema | 26/11 ముంబై బాంబు పేలుళ్ల (26/11 Mumbai terror attacks) ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా (Azam Cheema) మృతి చెందినట్లు సమాచారం.
Azam Cheema | 26/11 ముంబై బాంబు పేలుళ్ల (26/11 Mumbai terror attacks) ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా (Azam Cheema) మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ ( Faisalabad)లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తైనట్లు సమాచారం.
15 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అజామ్ ఛీమా కీలక సూత్రధారిగా గుర్తించారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో అతని పేరును మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది.
26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్ సూత్రధారిగా వ్యవహరించారు. 2006లో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉందని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 188 మంది ప్రాణాలు కోల్పోగా.. 800 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read..
Bengaluru cafe blast | ఈ అంశంలో బీజేపీ రాజకీయాలు చేయడం తగదు.. పేలుడు ఘటనపై సీఎం సిద్ధరామయ్య
Isha Ambani | సోదరుడి ముందస్తు వివాహ వేడుకల్లో మెరిసిన ఈషా అంబానీ.. ఆఫ్ షోల్డర్ గౌనులో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

