Kerala Ragging : కేరళ రాష్ట్రం (Kerala state) కొట్టాయం (Kottayam) లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ (Government Narsing college) లో జూనియర్ విద్యార్థుల (Junior students) పై దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల (Senior students) ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC).. ఘటనపై 10 రోజులలోగా నివేదిక అందజేయాలని కేరళ పోలీసుల (Kerala Police) ను కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
నర్సింగ్ థర్డ్ ఇయర్‌కు సంబంధించిన ఐదుగురు విద్యార్థులు రాహుల్ రాజ్ (Rahul Raj), ఎన్ఎస్ జీవా (NS Jeeva), ఎన్పీ వివేక్ (NP Vivek), రిగిల్ జీత్ (Rigil Jeeth), శామ్యూల్ జాన్సన్ (Samuel Johnson) లు ఫస్టియర్ విద్యార్థులను దారుణంగా ర్యాగింగ్ చేశారు. వారి జననాంగాలకు డంబెల్స్ వేలాడదీసి హింసించారు. కంపాస్‌తో గుచ్చారు. ఈ ఘటనపై జూనియర్ విద్యార్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Heatwaves | వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి : సందీప్ కుమార్ ఝా
Abhinav Singh | ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దు: సుప్రీంకోర్టు
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం