Abhinav Singh : అభినవ్ సింగ్ (Abhinav Singh)..! 32 ఏళ్ల అభినవ్ ఒడిశాకు చెందిన ప్రముఖ ర్యాపర్ (Rapper)..! తన పాటలతో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ భార్యతో విభేదాలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ హోటల్లో పరాయి మహిళలతో ఉన్న అభినవ్ సింగ్‌ను.. పోలీసులతో కలిసి వెళ్లిన ఆయన భార్య రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది. అదే సమయంలో ఒడిశా (Odisha) కు చెందిన ఓ నటి కూడా అభినవ్‌పై ఆరోపణలు చేసింది.
తన మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ కాకుండా అభినవ్ అడ్డుకున్నాడని, తనపై దాడికి పాల్పడ్డాడని ఆ నటి ఆరోపించింది. దాంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయాడు. ఇటీవలే కొత్త జాబ్ వెతుక్కొని, తన జీవితాన్ని ట్రాక్‌లో పెట్టుకుంటున్నట్టు కనిపించాడు. కానీ ఇంతలో బెంగళూరులోని తన అద్దె నివాసంలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య, అత్తింటివారి వేధింపులే తమ కొడుకు ఆత్మహత్యకు కారణమని అభివన్ తల్లిదండ్రులు ఆరోపించారు. అభినవ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అభినవ్ సింగ్ ర్యాపర్ మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. ఇటీవలే పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన అభినవ్.. అక్కడే నివసిస్తున్నాడు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ అప్పటికే భార్య దూరం కావడం, తనపై ఆరోపణలు చేయడంతో ఆయన చాలా కుంగిపోయాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అభినవ్ సింగ్ భార్య వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడా..? మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అభినవ్ ఒడియా ర్యా్ప్ పాటలతో చాలా ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ పాటతో మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాగే అర్బన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్‌ను కూడా స్థాపించాడు. కాగా అభినవ్ తల్లిదండ్రులు తనపై చేసిన ఆరోపణలను ఆయన భార్య తోసిపుచ్చింది. అత్తింటివారితో పడక తాను వేరుగా ఉంటున్నానని, అభినవ్ అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని ఆమె చెప్పారు. కొన్ని విషయాల్లో అతను మారాలనే తాను దూరం పెట్టానని, కానీ ఇంతలో ఇలా జరిగిందని అన్నారు.
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను మార్చి 17 వరకు అరెస్టు చేయవద్దు: సుప్రీంకోర్టు
TG High Court | హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజే సుజయ్ పాల్
MS Narayana | ఎంఎస్ నారాయణ చివరి క్షణంలో నన్ను చూడాలి అనుకున్నాడు : బ్రహ్మానందం