Kerala nuns : మానవ అక్రమ రవాణా (Human trafficking) కు, బలవంతపు మత మార్పిడి (Reliogious conversion) లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో గత వారం ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లో అరెస్టయిన ఇద్దరు కేరళ సన్యాసినిల (Kerala nuns) కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కి చెందిన ప్రత్యేక కోర్టు (Special court) షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. అందుకు ఇద్దరు సన్యాసినిలు వారి పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని, ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు పెట్టాలని, ఒక్కొక్కరికి ఇద్దరు వ్యక్తుల చొప్పున ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు షరతులు విధించింది.
కాగా కేరళకు చెందిన ఆ ఇద్దరు సన్యాసినిలు ముగ్గురు గిరిజన బాలికలను మతమార్పిడి చేయించేందుకు ప్రయత్నించారని బజరంగ్ దల్, హిందూవాహిని సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గత నెల 25న పోలీసులు ఆ ఇద్దరు సన్యాసినులను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం సన్యాసినిలు ముందు దుర్గ్‌లోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
అయితే వారి బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. మానవ అక్రమ రవాణా కేసులలో నిందితులకు బెయిల్ మంజూరు చేసే అధికారం భారత న్యాయ సంహిత నిబంధనల ప్రకారం సెషన్స్ కోర్టుకు లేదని, కాబట్టి బెయిల్ కోసం ఎన్ఐఏ స్పెషల్ కోర్టును ఆశ్రయించాలని సెషన్స్ కోర్టు జడ్జి సూచించారు. దాంతో కేరళ సన్యాసినిలు ఎన్ఐఏ స్పెషల్ కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.