Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ ఏడాది కూడా కేరళ వాసులు ఓనం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గత నెల 26న ప్రారంభమైన ఈ ఓనం వేడుకలు నేటితో (సెప్టెంబర్ 5) ముగియనున్నాయి. చివరి రోజు మలయాళీలు ఈ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు కసావు స్టైల్ చీరకట్టులో మెరిసిపోయారు. బంధువులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఓనసద్యా విందు ఆరగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
#WATCH | Kerala celebrates #Onam festival with great fervour today. Visuals from Thiruvananthapuram.
Today is Thiruvonam, the main festival of the ten-day-long Onam. People are celebrating today by visiting temples, gathering at houses, having Onam feast ‘Onam Sadya’ and… pic.twitter.com/R5CO4JXNIl
— ANI (@ANI) September 5, 2025
కేరళ సంస్కృతికి ప్రతీక ఓనం..
తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి, తమిళనాట దీపావళి ఎంత ప్రసిద్ధో.. ఓనం కూడా కేరళ సంస్కృతికి ప్రతీక (Onam festival). కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేరళలోని వ్యవసాయ పండుగ. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కుడా ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు.
ప్రత్యేకతలు..
ఈ పండుగ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.
ఓన సద్యం..
ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.
కసావు స్టైల్ చీర కట్టు..
ఈ పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ కుట్టీలు. అంతా ఓచోట చేరి ఊయలలు ఊగుతూ, సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ సందడిగా గడుపుతారు.
VIDEO | Pathanamthitta, Kerala: Bhattathiri arrives at the Aranmula Parthasarathy Temple with traditional Thiruvona delicacies, marking a key Onam ritual.#Onam
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/Hf6ScJ0w4R
— Press Trust of India (@PTI_News) September 5, 2025
Also Read..
Ajit Pawar | నీకు ఎంత ధైర్యం..? ఐపీఎస్ అధికారిణికి అజిత్ పవార్ బెదిరింపులు
Donald Trump | టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. మస్క్‌కు అందని ఆహ్వానం
బీహార్ ఎన్డీఏలో సీట్ల లొల్లి.. కూటమి పార్టీల్లో ముసలం