Kerala | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) కీలక ప్రకటన చేశారు. దేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన (eradicate extreme poverty) తొలి రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు తెలిపారు. కేరళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక సెషన్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
2021లో ఎల్డీఎఫ్ సర్కార్ అధికారంలోకి వచ్చి, కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో పేదరిక నిర్మూలన కూడా ఒకటని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పుడు కేరళను దేశంలో అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా మార్చడంలో విజయం సాధించినట్లు చెప్పారు. ‘నేటి కేరళ ఆవిర్భావ దినోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే కేరళను అత్యంత పేదరికం లేని మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేము విజయం సాధించాం. ఈ శాసనసభ అనేక చారిత్రక చట్టాలు, విధాన ప్రకటనలకు సాక్షిగా నిలిచింది. నవ కేరళ సృష్టిలో మరో మైలురాయిని గుర్తించే తరుణంలో అసెంబ్లీ ఇప్పుడు సమావేశమైంది’ అని అన్నారు.
2021లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయన్ సర్కార్ తన మొదటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించడం కూడా ఒకటి. ఇందుకోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి.. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించింది. వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు చర్యలు చేపట్టింది. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా పని కల్పించి వారు ఆర్థికంగా మెరుగుపడేందుకు సాయం చేసింది. ప్రజలందరికీ సమాన హక్కులు నివాసం, విద్య, వైద్యం అందించారు. ఫలితంగా నేడు రాష్ట్రం దుర్భర పేదరికం నుంచి బయటపడింది.
Also Read..
UPI | అక్టోబర్లో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. పూర్ కేటగిరీలో ఏక్యూఐ
Prashant Kishor | ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే 10 కంటే తక్కువే : ప్రశాంత్ కిషోర్