Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో ఓవరాల్ ఏక్యూఐ (AQI) లెవెల్స్ 245గా నమోదైంది.
అత్యధికంగా వాజీపూర్లో గాలి నాణ్యత సూచిక 328గా, బావనా ప్రాంతంలో 301గా నమోదైంది. జహంగిరిపురి వద్ద 300, చాందినీ చౌక్ వద్ద 299, ఆర్కే పురం వద్ద 298, ఆనంద్ విహార్లో 298, సిరిఫోర్ట్లో 295, అశోక్ విహార్లో 287, నెరేలా ప్రాంతంలో 283, రోహిణి 281, ఐటీవోలో 275, పత్పర్గంజ్ వద్ద 274, పంజాబ్ బాగ్ వద్ద 265, బురారి క్రాసింగ్ వద్ద 264, ద్వారకా సెక్టార్-8లో 260, ముంద్కా ప్రాంతంలో 259, అలీపూర్ ప్రాంతంలో 258గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ సంతృప్తికరంగా నమోదైంది. ఆయా నగర్లో 182, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద 188, డీటీయూ ప్రాంతంలో 181, లోధి రోడ్డులో 150గా గాలి నాణ్యత నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
దేశ రాజధాని నగరంలో కాలుష్యం తీవ్రంగా ఉంది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం, నాలుగింట మూడు కుటుంబాల్లో కనీసం ఒకరు అస్వస్థతతో బాధపడుతున్నారు. 15,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.సెప్టెంబర్లో 56% కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది రోగులు ఉన్నారు. ఇటువంటి కుటుంబాలు అక్టోబర్లో 75 శాతానికి పెరిగాయి.
Also Read..
ISRO | రేపు ఎల్వీఎం3–ఎం5 ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చీఫ్
Prashant Kishor | ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే 10 కంటే తక్కువే : ప్రశాంత్ కిషోర్
LPG cylinder | వినియోగదారులకు కాస్త ఉపశమనం.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర