ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లే ఎల్వీఎం3-ఎం5 (Mark3) రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చీఫ్ (ISRO Chief) వి.నారాయణన్ (V Narayanan) ఇవాళ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు (Sri Venkateswara Temple).
శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఎల్వీఎం3-ఎం5 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే అధికారులు ఇస్రో చీఫ్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో ఇస్రో చీఫ్ మాట్లాడారు. 2025, నవంబర్ 2న ఎల్వీఎం3-ఎం5 ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించారు. CMS-03 అనేది LVM3-M5 లాంచ్ వెహికల్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టే కమ్యూనికేషన్ ఉపగ్రహంగా తెలిపారు. ఇది అత్యంత బరువైన ఉపగ్రహం అని చెప్పారు. దీని బరువు 4,410 కిలోలు అని వివరించారు. ఈ ప్రయోగం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు జరగనుందని ప్రకటించారు.
#WATCH | Andhra Pradesh: ISRO Chief V Narayanan offered prayers at the Tirumala Lord Sri Venkateswara Temple
He says, “On 2nd November 2025, we have targeted the launch of LVM3-M5/CMS-03 Mission. The CMS-03 is a communication satellite which will be placed in orbit by the… pic.twitter.com/yHkwWq9a0H
— ANI (@ANI) November 1, 2025
మరోవైపు సీఎంఎస్–03 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. 25.30 గంటల పాటూ ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు సాయంత్రం 5.26 గంటలకు 4,400 కిలోల బరువు కలిగిన సీఎంఎస్–03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. 16.09 నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెడతారు. కాగా, 4,400 కిలోల బరువైన సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించడం ఇదే మొదటిసారి.
Also Read..
Prashant Kishor | ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే 10 కంటే తక్కువే : ప్రశాంత్ కిషోర్
Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో మాజీ ఈవో అరెస్టు