Kedarnath Pilgrim | సెల్ఫీ తీసుకునేందుకు (Taking Selfie) ప్రయత్నించి ఓ యువకుడు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న మందాకినీ నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని అతికష్టం మీద ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు కేదార్నాథ్ (Kedarnath) యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో మందాకినీ నది (Mandakini river) వద్ద సెల్ఫీ తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (Uttarakhand State Disaster Response Force ) తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి ఆ యువకుడినిప్రాణాలతో బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
वायरल वीडियो केदारनाथ का बताया जा रहा है… ये महोदय सेल्फी लेते वक्त फिसलकर नदी में गिर गए, गनीमत रही कि स्थानीय लोगों ने बचा लिया.@kedarnathdham #kedarnath #kedarnathdham #viralvideo #selfie #river pic.twitter.com/fo2SGRkA6T
— Shailendra Singh (@Shailendra97S) September 5, 2023
Also Read..
Ram Charan | దుమారం రేపుతున్న ఉదయనిధి వ్యాఖ్యలు.. ‘సనాతన ధర్మం’పై రామ్ చరణ్ ట్వీట్ వైరల్
Vijay Deverakonda | ఖుషి సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో విజయ్.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన