Ram Charan | దుమారం రేపుతున్న ఉదయనిధి వ్యాఖ్యలు.. ‘సనాతన ధర్మం’పై రామ్ చరణ్ ట్వీట్ వైరల్
Ram Charan | ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ‘సనాతన ధర్మం’పై టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
Ram Charan | ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో ‘సనాతన ధర్మం’పై టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ) ట్వీట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ‘సనాతన ధర్మం’పై గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పాత ట్వీట్ లో తన తల్లి సురేఖ ఇంట్లోని తులసి కోట వద్ద పూజ చేస్తూ కనిపించారు. ఈ ఫొటో షేర్ చేసిన చరణ్.. ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత’ అని పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ 11 నాటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత…. #Bharathiya_Culture_Matters pic.twitter.com/Mi5Bl3k8nY
— Ram Charan (@AlwaysRamCharan) September 11, 2020
Also Read..
Vijay Deverakonda | ఖుషి సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో విజయ్.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన
G20 Summit | ఆ మూడు రోజులు ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ సహా పలు ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్
Nitish Kumar | ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిందపడిపోయిన సీఎం నితీశ్ కుమార్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

