Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar ) కిందపడిపోయారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఒక్కసారిగా పట్టుకోల్పోయారు (Loses Balance). అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే సీఎంను పైకి లేపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంగళవారం పాట్నా యూనివర్సిటీలో (Patna University) ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్ సహా బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ గిరీస్ కుమార్ చౌదరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు అంతా స్టేజ్‌పైకి వెళ్లారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎంను పైకి లేపారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
शिक्षक दिवस के कार्यक्रम में लड़खड़ाकर गिरे CM नीतीश कुमार#NitishKumar pic.twitter.com/mpLrwoALmY
— Sritygupta (@sritygupta) September 5, 2023
Also Read..
G20 Summit | ఆ మూడు రోజులు ఢిల్లీలో స్విగ్గీ, జొమాటో, అమెజాన్ సహా పలు ఆన్లైన్ డెలివరీ సేవలు బంద్
Vijay Deverakonda | ఖుషి సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో విజయ్.. ఫ్యాన్స్‌కు రూ.కోటి ఇస్తానంటూ ప్రకటన