Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
జూన్ 4న తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయని చెప్పారు. కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి సర్కార్ కొలువుతీరుతుందనే విషయంలో తాము గట్టి నమ్మకంతో ఉన్నామని అన్నారు. దేశంలో వాతావరణం విపక్ష కూటమికి అనుకూలంగా ఉందని అంచనా వేశారు.
ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇదే విషయం వెల్లడిస్తోందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తుందని, బీజేపీ 400 స్ధానాలు వస్తాయని చెబుతున్నా తాము మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
Read More :