Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఇటీవలే అమెరికా పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ కర్ణాటకలోని బీజేపీ (Karnataka BJP) నేతలు రాహుల్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదు మేరకు రాహుల్‌పై బెంగళూరులోని హై గ్రౌండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా, ఈ నెల ఆరంభంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన మాట్లాడారు. భారత్‌లో మత స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. కొన్ని అంశాలపై భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు.
‘దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల జనాభా 90 శాతం ఉంది. కానీ దేశంలోని మొదటి 200 వ్యాపారుల్లో, అత్యున్నత న్యాయస్థానాల్లో, మీడియాలో వీరి భాగస్వామ్యం దాదాపు శూన్యం. కేంద్ర ప్రభుత్వంలో 78 మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక్క మైనారిటీ మాత్రమే ఉన్నారు. కులగణన ద్వారానే దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయి’ అని రాహుల్ అన్నారు. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి ఆలోచిస్తామని, ఇప్పుడు భారత్‌లో అందరికీ సమాన అవకాశాలు లేవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Also Read..
Kamal Haasan | వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన ప్రమాదకరమైనది : కమల్ హాసన్
Ratna Bhandar: పూరి జగన్నాథ్ రత్నభండార్‌లో రెండో సర్వే షురూ..
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసిన స్టూడెంట్.. విద్యార్థుల నిరసన