Ratna Bhandar: పూరి జగన్నాథ్ రత్నభండార్లో రెండో సర్వే షురూ..
Ratna Bhandar: జగన్నాథ ఆలయ రత్నభండార్ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. దీంతో దర్శనాలు ఆపేశారు. మూడు రోజుల పాటు సర్వే జరగనున్నది.
పూరి: ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయ రత్నభండార్(Ratna Bhandar)ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వరకు.. ఆలయంలో దర్శనాలు నిలిపివేసినట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిష్ట్రేషన్ పేర్కొన్నది. మూడు రోజలు పాటు రత్నభండార్లో ఉన్న సంపద కోసం అన్వేషించనున్నారు. సర్వే సమయంలో ఆలయ ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాండే తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన తన విజ్ఞాపనలో కోరారు.
రత్నభండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మెన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కూడా సర్వేలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని, ఒకవేళ రత్నభండార్లో ఏదైనా రహస్య చాంబర్ కానీ, టన్నెల్ కానీ ఉందో అన్న కోణంలో సర్వే జరగనున్నట్లు చెప్పారు. దీని కోసం అత్యాధునిక రేడార్ను కూడా తీసుకువచ్చారు. సెప్టెంబర్ 18వ తేదీన తొలి సర్వే జరిగింది. దాంట్లో 17 మంది సభ్యులు ఉన్న ఏఎస్ఐ బృందం.. ప్రాథమిక ఇన్స్పెక్షన్ చేపట్టింది. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐలకు చెందిన నిపుణులు ఆ బృందంలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

