బెంగళూరు: కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. (Student Records Videos) టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆ కాలేజీ వద్ద పెద్ద ఎత్తున్న నిరసనకు దిగారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి కాలేజీ వాష్‌రూమ్‌లో అమ్మాయిల వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు.
కాగా, దీనిని గుర్తించిన విద్యార్థులు శనివారం ఆ కాలేజీ వద్ద భారీగా నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. విషయాన్ని ఆరా తీయగా ఒక స్టూడెంట్ మొబైల్ ఫోన్లో కాలేజీ అమ్మాయిల వీడియోలు 8 ఉన్నట్లుగా గుర్తించినట్లు విద్యార్థినులు తెలిపారు. సమస్యను మరింత పెంచితే చంపుతామని అతడు బెదిరించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుడైన ఏడో సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకు దిగిన విద్యార్థులకు హామీ ఇచ్చారు.
I came to know about a shocking incident that has taken place in ACS College of engineering. A Male student was found recording private videos of girls by invading their washrooms.
This incident has sparked outrage among the students and has shocked everyone including me and… pic.twitter.com/yHPmoB8Tcm
— Anvith kateel (@anvith_kateel) September 20, 2024