శనివారం 28 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 14:56:14

కరోనా వ‌ల్ల బాణాసంచాపై నిషేధం: సీఎం య‌డ్యూర‌ప్ప‌

కరోనా వ‌ల్ల బాణాసంచాపై నిషేధం:  సీఎం య‌డ్యూర‌ప్ప‌

హైద‌రాబాద్‌: దీపావ‌ళి వేళ బాణాసంచాపై క‌ర్నాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ నిషేధం విధిస్తున్న‌ట్లు సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు. బాణాసంచా పేలుళ్ల వ‌ల్ల‌ వాయు నాణ్య‌త త‌గ్గుతుంద‌ని, అయితే కోవిడ్ వేళ ఆ నాణ్య‌త త‌గ్గ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం చెప్పారు. వాయు కాలుష్యం వ‌ల్ల శ్వాస‌కోస స‌మ‌స్య‌లు పెరుగుతాయ‌ని, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా బాణాసంచా పేలుళ్ల‌తో ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీని గురించి చ‌ర్చించామ‌ని, ఆ త‌ర్వాత బాణాసంచా పేలుళ్ల నిషేధంపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం య‌డ్డీ తెలిపారు.  నిషేధ ఆదేశాలు కూడా జారీ చేశామ‌న్నారు.  ఇప్ప‌టికే బాణాసంచా పేలుళ్ల‌ను నిషేధిస్తూ ఒడిశా, ఢిల్లీ, రాజ‌స్థాన్ రాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. శీతాకాలంలో వాయు నాణ్య‌త త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని ఆ రాష్ట్రాలు చెప్పాయి.