Polling Percent | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections)తోపాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 11 గంటల వరకూ 25 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో 29.31 శాతం.. వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3
— ANI (@ANI) November 13, 2024
కాగా, జార్ఖండ్ రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతోంది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 683 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. జార్ఖండ్‌తో పాటు వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక ఇవాళే జరుగుతున్నది. రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇస్తున్నారు.
Also Read..
PM Modi | ఈనెల 16 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్న మోదీ.. 56 ఏళ్ల తర్వాత గయానాకు భారత ప్రధాని
Devendra Fadnavis | ఫడ్నవీస్ బ్యాగ్‌ను కూడా చెక్ చేశారు.. వీడియోతో ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ