Express Train | జమ్మూ – జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jammu – Jodhpur express train)కు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రైలును ఆపేసి తనిఖీలు చేపట్టారు.
19926 నంబర్ గల ఎక్స్‌ప్రెస్ రైలు జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు పంజాబ్ (Punjab)లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోకి రాగానే ట్రైన్లో బాంబు పెట్టినట్లు కొందరు వ్యక్తులు పోలీసులకు ఫోన్ ద్వారా బెదిరించారు. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే రైలును కాసు బేగు (Kasu Begu) స్టేషన్లో నిలిపివేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో రైలు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ, పేలుడు పదార్థాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రిజిస్టరైన మొబైల్ నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Punjab: Express train going from Jammu to Jodhpur stopped at Kasu Begu station of Firozpur after Police received a phone call regarding a bomb threat onboard. Police teams have reached the spot and an investigation is underway. pic.twitter.com/P6BrPdI1WP
— ANI (@ANI) July 30, 2024
Also Read..
Howara-CSMT Express | పట్టాలు తప్పిన హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి
Mamata Banerjee | దేశంలో రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి.. జార్ఖండ్ ఘటనపై బెంగాల్ సీఎం
Wayanad | వయనాడ్ విలయం.. 56కి పెరిగిన మృతుల సంఖ్య