Wayanad | వయనాడ్ విలయం.. 56కి పెరిగిన మృతుల సంఖ్య
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ విలయంలో మరణించిన వారి సంఖ్య 56కి పెరిగింది. వంద మందికిపైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సుమారు 70 మందికిపైగా గాయపడ్డారు. వారు మెప్పడిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా నివేదించింది.
మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సమీప ఇంళ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి.
ఈ విలయంలో చూరల్ మాలా పట్టణం సగం వరకూ తుడిచి పెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీని వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ నిలిచిపోయాయి.
వయనాడ్ విలయానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్రంగా ప్రవహిస్తున్న నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ముందక్కాయిలో ఉన్న ఓ మదరసాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంటల్లోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో.. రైలు సర్వీసులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.
Also Read..
Wayanad Landslides: వయనాడ్ విలయం.. వీడియోలు
Rahul Gandhi | వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
Kerala | కేరళలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

