తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. వర్షాల వల్ల తీవ్రమైన వరద రావడంతో.. మట్టిచరియలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 47కు చేరుకున్నది.
The death toll in the Wayanad landslides has risen to 8. Those dead also include three children.
The first landslide was reported at nearly 2 am. Later, at nearly 4.10 am, the district was struck by another landslide. #WayanadLandslide #Wayanad #Kerala pic.twitter.com/TCAWfMdaCz
— Vani Mehrotra (@vani_mehrotra) July 30, 2024
మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సమీప ఇండ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి.
വയനാട് രക്ഷാപ്രവർത്തനം.@airnewsalerts @airnews_tvm
AIR VIDEOS: Arunvincent, PTC Wayanad pic.twitter.com/TcISMAzxjv— All India Radio News Trivandrum (@airnews_tvm) July 30, 2024
చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. దీని వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా నిలిపోయింది.
This used to be a village.
Current situation in Wayanad.#Waynad #Kerala pic.twitter.com/DekF3pqMaq
— Vishnu (@IVishnu__) July 30, 2024
వయనాడ్ విలయానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్రంగా ప్రవహిస్తున్న నీటిలో ఓ కారు కొట్టకుపోయింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. ముందక్కాయిలో ఉన్న ఓ మదరసాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంటల్లోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతిన్నాయి.
Heartbreaking to hear about the tragic loss of lives due to the landslide in Wayanad, Kerala. My sincere sympathies to the families who have lost their loved ones. May God give them strength to bear the loss.
Just Pray 🙏 For #Wayanad #Kerala #Landslides #WayanadLandslid🥹 pic.twitter.com/RUvAGWyIon— Valli S Rajan (@vallir51) July 30, 2024