Malayalam Cinema | మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్రీనివాసన్ (Sreenivasan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, దర్శకుడిగా, కథా రచయితగా ఐదు దశాబ్దాల పాటు కేరళ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందించాడు. ‘వడక్కునోక్కియంత్రం’, ‘చింతవిశిష్టాయ శ్యామల’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. శ్రీనివాసన్ ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. శ్రీనివాసన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నటులు మోహన్ లాల్, మమ్ముట్టి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.