Kerala | భారీ వర్షాలకు కేరళ (Kerala) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ప్రభావితమయ్యాయి. మంగళవారం కురిసిన వర్షానికి వయనాడ్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు.
కాగా, రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసర్గోడ్, కన్నూర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ (IMD issued Red alert) చేసింది. అదేవిధంగా ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న 3 గంటల్లో కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సుమారు 10 జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Kerala | IMD issued Red alert for 4 districts – Kozhikode, Malappuram, Wayanad and Kasaragod.
Orange alert in Pathanamthitta, Alappuzha, Kottayam, Ernakulam, Idukki, Thrissur and Palakkad pic.twitter.com/vgqXAnQz8A
— ANI (@ANI) July 30, 2024
Also Read..
Kerala | ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు.. నిలిచిన రైళ్ల రాకపోకలు
Landslides | కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. 19 మంది దుర్మరణం
Venezuela: మాడురో ఎన్నిక.. వెనిజులాలో ఆందోళన.. నిరసకారులపై పోలీసుల ఫైరింగ్