Rahul Gandhi | కేరళలోని (Kerala) వయనాడ్ (Wayanad ) జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వయనాడ్ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు తెస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ కలెక్టర్‌తో మాట్లాడినట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారన్నారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోరినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఏదైనా సాయం అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు.
కాగా, మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 225 మంది సైనిక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Kerala | కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 36కు పెరిగిన మృతులు : కేరళ మంత్రి వీణా జార్జ్
Kerala | కేరళలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Kerala | ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు.. నిలిచిన రైళ్ల రాకపోకలు