ఆత్మకూరు.ఎస్, డిసెంబర్ 22 : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలంలోని ఏపూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి వెంకటాపురం శివారులోని ముగ్గురు రైతులు వీరబోయిన రాజయ్య, అవిరే నర్సయ్య, అవిరె లింగయ్య స్టార్టర్ నుండి కరెంట్ పోల్ వరకు కరెంట్ తీగలను సుమారు రూ.30 వేల విలువ గల వైరును దొంగలు అపహరించుకుపోయారు. ఆదివారం రాత్రి గుండ్లపల్లి సతీశ్‌కు చెందిన ట్రాక్టర్ ట్రాలీ రెండు చక్రాలను విప్పుకుని వెళ్లారు. చక్రాల విలువ రూ.70 వేల ఉంటుందని బాధితుడు వాపోయాడు. రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల వద్ద దొంగతనాలు జరుగుతుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.