లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) చేసిన వ్యాఖ్యలకు .. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కొడైన్ దగ్గు మందుపై వేసిన ఓ ప్రశ్నకు ఇవాళ సీఎం యోగి ఆదిత్యనాథ్ బదులిస్తూ దేశంలో ఇద్దరు నమోనా వ్యక్తలు ఉన్నారని, ఒకరు ఢిల్లీ, ఒకరు లక్నోలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఇద్దరూ చర్చలు జరుగుతున్న సమయంలో దేశం విడిచి వెళ్తారని యోగి ఆరోపించారు. ఆయన తన వ్యాఖ్యల్లో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించినట్లుగా ఉన్నది.
कोडीन कफ सिरप से उत्तर प्रदेश के अंदर कोई मौत नहीं हुई है…
देश के अंदर दो नमूने हैं, एक दिल्ली में और एक लखनऊ में बैठते हैं,
जब देश में कोई चर्चा होती है तो वह तुरंत देश छोड़कर भाग जाते हैं… pic.twitter.com/vv0eabVu2S
— Yogi Adityanath (@myogiadityanath) December 22, 2025
విధానసభలో సీఎం యోగి చేసిన వ్యాఖ్యలకు సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ తన ఎక్స్ అకౌంట్లో కౌంటర్ ఇచ్చారు. సీఎం యోగి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీజేపీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయని, లక్నోలో ఉన్న యోగి, ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ మధ్య సఖ్యత సరిగా లేదని, ఆ విషయాన్ని సీఎం యోగి తన వ్యాఖ్యల్లో చెప్పినట్లు అఖిలేశ్ ఆరోపించారు. వందల కోట్ల దగ్గుమందు వ్యాపారం జరిగిందని, వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.
आत्म-स्वीकृति!
किसी को उम्मीद नहीं थी कि दिल्ली-लखनऊ की लड़ाई यहाँ तक पहुँच जाएगी। संवैधानिक पदों पर बैठे लोग आपस में कुछ तो लोक-लाज रखें और मर्यादा की सीमा न लाँघें। भाजपाई अपनी पार्टी के अंदर की खींचातानी को चौराहे पर न लाएं। कहीं कोई बुरा मान गया तो वापस जाना पड़ेगा। pic.twitter.com/99SMGEgD7M
— Akhilesh Yadav (@yadavakhilesh) December 22, 2025