Mamata Banerjee | జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశంలో రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమైపోయాయన్నారు. ప్రతివారం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ‘మరో ఘోరమైన రైలు ప్రమాదం..! ఈ రోజు తెల్లవారుజామున జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ డివిజన్లో హౌరా – ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కొందరు చనిపోగా.. భారీ సంఖ్యలో గాయపడ్డారు. దేశంలో రైలు ప్రమాద ఘటనలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి వారం ఏదో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాను.. ఇంకా ఎంతకాలం వీటిని సహించాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అంతం ఉండదా..?’ అని ఎక్స్ వేదికగా మోదీ సర్కార్‌ను దీదీ నిలదీశారు.
Another disastrous rail accident! Howrah- Mumbai mail derails in Chakradharpur division in Jharkhand today early morning, multiple deaths and huge number of injuries are the tragic consequences.
I seriously ask: is this governance? This series of nightmares almost every week,…
— Mamata Banerjee (@MamataOfficial) July 30, 2024
జంషేడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు, పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో హౌరా – టిట్లాగఢ్ – కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్‌ప్రెస్, హౌరా – బార్బిల్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
#WATCH | Jharkhand: Train No. 12810 Howara-CSMT Express derailed near Chakradharpur, between Rajkharswan West Outer and Barabamboo in Chakradharpur division at around 3:45 am.
Two people have lost their lives so far.
( Latest Visuals from the spot) pic.twitter.com/qYAmk2bpEg
— ANI (@ANI) July 30, 2024
Also Read..
Howara-CSMT Express | పట్టాలు తప్పిన హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి
Rahul Gandhi | వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ