Human like Skull | మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పాడుబడిన ఇంట్లో మానవ అవశేషాలు లభ్యమయ్యాయి (Human like Skull). డోంబివ్లి (Dombivli)లోని సోనార్పాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి పుర్రె, అస్థిపంజరాల (Skeleton) అవశేషాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మానవ అవశేషాలను పరిశీలించారు. మనిషి పుర్రె, ఎముకలు, చెప్పులు, దుస్తులు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వైద్యాధికారి ఆదేశాల మేరకు వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జేజే ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
Silver hallmarking | బంగారం తరహాలో.. వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి.. యోచనలో కేంద్రం
Sachin Tendulkar | సచిన్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్
Dangerous Stunts | పోలీసుల ముందే కుప్పిగంతులా.. బైక్‌తో ప్రమాదకర స్టంట్స్