Silver hallmarking | మార్కెట్లో వెండి (Silver)కి డిమాండ్ పెరిగింది. వైట్ మెటల్ ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. బంగారాన్ని మించి వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.51 లక్షలకుపైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆలోచన చేసింది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు మోసాలబారిన పడకుండా ఉండేందుకు బంగారం తరహాలోనే వెండికి కూడా హాల్మార్కింగ్ (Silver hallmarking) తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి లేదు. కానీ ప్రస్తుతం ధరలు పెరుగుతుండటంతో వెండికి కూడా తప్పనిసరిగా హాల్మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగతోంది. అందుకు తగ్గట్టుగా నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ తెలిపారు. కొత్త నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Also Read..
మందగించిన సర్వీస్ సెక్టార్.. వృద్ధిరేటు 11 నెలల కనిష్ఠానికి పతనం
ఎల్ఐసీ నయా జీవన్ ఉత్సవ్.. 12 నుంచి సింగిల్ ప్రీమియం పాలసీ
రెండోరోజూ కుప్ప కూలిన మార్కెట్లు