ముంబై, జనవరి 6: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఓ సరికొత్త బీమా పథకాన్ని తీసుకొచ్చింది. జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం (ప్లాన్ 883) స్కీమ్ ప్రారంభించింది. ఈ నెల 12 నుంచి కొనుగోలుదారులకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఇదో నాన్-పార్టిసిపేటెడ్, నాన్-లింక్డ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. గ్యారంటీడ్ అడిషన్స్ పీరియడ్లో పాలసీదారులకు నిర్దిష్ట ప్రయోజనాలుంటాయి. ఇక ఈ ప్లాన్ యూనిక్ ఐటెంటిఫికేషన్ నెంబర్ 512N392V01.