నల్లగొండ రూరల్, జనవరి 07 : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ యూత్ జేఏసీ చైర్మైన్ కట్టెకోలు దీపెందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు అయినందున త్వరలో జరగబోయే ఎన్నికల్లో మేయర్ పదవిని బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తొలి మేయర్ పదవిని బీసీలకే కేటాయించి బీసీల మీద తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే మున్సిపాలిటీ, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు అయిన కార్పొరేషన్ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి రాష్ట్రంలో నల్లగొండ ఉత్తమ కార్పొరేషన్‌గా రూపుదిద్దుకునే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కొడదల శంకర్, నారగోని వెంకట్, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, బొమ్మగాని సందీప్ కుమార్, తుమ్మ సాత్విక్, అందే రాకేష్, శివ, వెంకట్, రాకేష్ పాల్గొన్నారు.