Jatadhara | టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheer babu) నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైం వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇప్పటివరకు తెలుగులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఇక హిందీలో కూడా చూడొచ్చు. జటాధర హిందీ వెర్షన్ను కూడా యాడ్ చేసింది అమెజాన్ ప్రైం వీడియో. కొన్నిసార్లు టాలీవుడ్లో ఫెయిలై హిందీలో డబ్ అయిన సినిమాలకు మంచి స్పందన వస్తుందని తెలిసిందే. మరి జటాధర హిందీ వెర్షన్ నార్తిండియా ప్రేక్షకుల దగ్గర ఎలాంటి మార్కులు కొట్టేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా.. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించింది. జటాధరతో సోనాక్షిసిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. జటాధరలో సోల్ ఆఫ్ జటాధర ట్రాక్ సినిమాకే హైలెట్గా నిలిచిందనండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే కంటెంట్ పరంగా ప్రేక్షకులను రీచ్ అవ్వలేకపోయింది జటాధర.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?