Jammu jails | పెహల్గామ్ ఉగ్రదాడితో జమ్ము కశ్మీర్ మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నారు. పెహల్గామ్ దాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను, అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైళ్లలో పెట్టారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడులు (terror strike) జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించారు. జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రవాదులను విడిపించుకునేందుకు భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో జమ్ము జైళ్లలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
జమ్ములోని జైళ్లతోపాటు శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ బాల్వాల్ జైళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం (security tightened) చేశారు. ఆయా జైళ్లలో ఉన్నతస్థాయి ఉగ్రవాదులు, స్లీపర్ సెల్ సభ్యులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఉన్నారు. పలువురు హైప్రొఫైల్ ఉగ్రనాయకులు సైతం ఆయా జైళ్లలో నిందితులుగా ఉన్నారు. వారిని విడిపించుకునేందుకు జైళ్లపై దాడికి కుట్రపన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయాజైళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జైళ్ల వద్ద పోలీసులు, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.
Also Read..
Tangmarg | ఉగ్రవాదులకు సాయం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి వ్యక్తి మృతి
Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్లు
Traffic Alert | హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 4 తర్వాత ఈ రూట్లలో వెళ్లారో అంతే సంగతి..