Jammu Kashmir | పదేళ్ల తర్వాత జమ్మూ అసెంబ్లీకి ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకూ 11 శాతం పోలింగ్
Jammu Kashmir | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది.
Jammu Kashmir | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే (ఉదయం 9 గంటల వరకూ ) 11.11 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది.
కాగా, ఏడు జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలి విడుతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరాజ్ రీజియన్లోని అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలు, చీనాబ్ లోయలోని డోడా, కిశ్త్ వాద్, రాంబన్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్ పుర, కుల్గాం, దేవ్సర్, దూరు, కోకెర్నాగ్, అనంత్ నాగ్ వెస్ట్, అనంత్ నాగ్, శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
Jammu and Kashmir 1st phase Assembly elections: 11.11% voter turnout recorded in Jammu and Kashmir till 9 am, as per the Election Commission of India pic.twitter.com/ouCB0af95W
— ANI (@ANI) September 18, 2024
Also Read..
Donald Trump: ప్రధాని మోదీని కలుస్తా: డోనాల్డ్ ట్రంప్
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లో తొలి విడుత ఎన్నికలు ప్రారంభం.. 24 నియోజకవర్గాలకు పోలింగ్
Superbug | 25 ఏండ్లలో 4 కోట్ల మందిని బలి తీసుకోనున్న సూపర్బగ్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

