ఆదివారం 24 జనవరి 2021
National - Jan 06, 2021 , 13:34:26

బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కూ వ్యాపించ‌గ‌ల‌దు: ‌కేంద్ర మంత్రి

బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కూ వ్యాపించ‌గ‌ల‌దు: ‌కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ నిర్ధార‌ణ కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం దానిపై అప్ర‌మ‌త్త‌మైంది. బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌భావిత రాష్ట్రాల‌తో ఎప్పిటిక‌ప్పుడు మాట్లాడుతూ త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఎ1 ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌ ప్ర‌భావం ఉన్న‌ట్లు త‌మ‌కు నివేదిక‌లు వ‌చ్చాయ‌ని కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క, ఫిష‌రీస్‌, డెయిరీ శాఖ‌ల స‌హాయ మంత్రి సంజీవ్ బ‌ల్యాన్ తెలిపారు. హ‌ర్యానాలో ఈ వైర‌స్ పౌల్ట్రీకి కూడా సోకింద‌ని, అదేవిధంగా వ‌న్య‌ప్రాణులు, వ‌ల‌స ప‌క్షుల్లో కూడా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని బ‌ల్యాన్ చెప్పారు.

ఈ బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు కూడా సంక్రమించే అవ‌కాశం ఉన్న‌ద‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఎక్క‌డా మ‌నుషుల్లో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని సంజీవ్ బ‌ల్యాన్ తెలిపారు. ఈ వైర‌స్ వ‌ల్ల సంక్ర‌మించే వ్యాధికి చికిత్స లేద‌ని, అందుకే అన్ని రాష్ట్రాలు ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కోళ్ల‌ ర‌వాణాపై ఆంక్ష‌లు విధించ‌డంతోపాటు, వ్యాధి సోకిన ప‌క్షుల‌ను స‌రైన రీతిలో నిర్మూలించాల‌ని సూచించారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo