Isha Ambani | రేపటితో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు సైతం ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు పోటెత్తుతున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. తన భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న ఇషా అంబానీ.. అక్కడి నుంచి గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమానికి (Triveni Sangam) వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎం (Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుఖూ (Sukhvinder Singh Sukhu) సైతం మహాకుంభమేళాను సందర్శించారు. త్రివేణీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించారు.
రేపే చివరి అమృత్‌స్నానం..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరింది. రేపటితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. చివరి అమృత్ స్నానం (final Amrit Snan) కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్
రేపు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’ (No Vehicle Zone)గా మారుస్తున్నామని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్‌రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు. యాత్రికులంతా ఈ మార్గదర్శకాలను పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
#WATCH | Prayagraj, UP: Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu along with his family takes a holy dip at Triveni Sangam.#MahaKumbh2025 pic.twitter.com/glZt8eZEX9
— ANI (@ANI) February 25, 2025
Also Read..
Ranjana Nachiyaar | త్రిభాషా సూత్రం తప్పు.. బీజేపీకి తమిళ నటి రాజీనామా
Preity Zinta | తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సిగ్గుచేటు.. కాంగ్రెస్ పార్టీపై ప్రీతి జింటా ఆగ్రహం