Preity Zinta | తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సిగ్గుచేటు.. కాంగ్రెస్ పార్టీపై ప్రీతి జింటా ఆగ్రహం
Preity Zinta | కాంగ్రెస్ (Congress) పార్టీపై బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా (Preity Zinta) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Preity Zinta | కాంగ్రెస్ (Congress) పార్టీపై బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా (Preity Zinta) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాపీ అయ్యేందుకు నటి తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై నటి తాజాగా స్పందించింది. ఈ మేరకు హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
తన సోషల్ మీడియా ఖాతాలను తానే సొంతంగా నిర్వహించుకుంటున్నానని స్పష్టం చేసింది. ఎవరికీ ఇవ్వలేదని తెలిపింది. తన రుణాన్ని ఎవరూ మాఫీ చేయలేదని పేర్కొంది. పదేండ్ల కిందటే బ్యాంకు నుంచి తాను రుణం తీసుకొని తీర్చేశానని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి తాను షాక్ అయ్యానని చెప్పింది. తనపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
కాగా, సోమవారం కేరళ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. నటి ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించినందుకు న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఆమె తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందని ఆ పోస్ట్‌లో ఆరోపించింది. గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని పేర్కొంది. ఈ మేరకు ఈ పోస్ట్‌కు ప్రీతి జింటా ఫొటోను చూడా జత చేసింది. దీనిపై నటి తాజాగా స్పందించింది.
No I operate my social media accounts my self and shame on you for promoting FAKE NEWS ! No one wrote off anything or any loan for me. I’m shocked that a political party or their representative is promoting fake news & indulging in vile gossip & click baits using my name &… https://t.co/cdnEvqnkYx
— Preity G Zinta (@realpreityzinta) February 25, 2025
Also Read..
CAG Report | ఢిల్లీ అసెంబ్లీ ముందుకు కాగ్ రిపోర్ట్.. చర్చకు అనుమతించిన స్పీకర్
Maha Kumbh | రేపే చివరి అమృత్‌స్నానం.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

