CAG Report | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం సభను ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదికను (CAG report) బీజేపీ (BJP) ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిధులను పాలకులు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కాగ్ నివేదికపై చర్చకు స్పీకర్ విజేందర్ గుప్తా అనుమతించారు. దీంతో ఈ నివేదికపై చర్చను అరవింద్ సింగ్ లవ్లీ ప్రారంభించారు. దీనిపై రెండు రోజులపాటు సభలో చర్చ జరుగుతుంది.
అంతకుముందు సభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. సెషన్ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఢిల్లీ సీఎంవో నుంచి అంబేడ్కర్ ఫొటోలను తొలగించడంపై నిరసనకు దిగారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు (AAP MLAs suspended). మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు ఆతిశీ సహా మొత్తం 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజంతా సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Delhi CM Rekha Gupta tables the CAG report on Excise Policy 2024.
Source: Vidhan Sabha https://t.co/b033XjJhTk pic.twitter.com/FOWwxWkvqO
— ANI (@ANI) February 25, 2025
Also Read..
Delhi Assembly | ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం.. ఆతిశీ సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
Maha Kumbh | రేపే చివరి అమృత్‌స్నానం.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్