Delhi Assembly | ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly)లో గందరగోళం నెలకొంది. ఢిల్లీ సీఎంవో నుంచి అంబేడ్కర్ ఫొటోలను తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెషన్ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.
దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు (AAP MLAs suspended). మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు ఆతిశీ సహా మొత్తం 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజంతా సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. మద్యం కుంభకోణం (Delhi Excise Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదికను (CAG report) భాజపా (BJP) ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
#WATCH | AAP MLAs, including LoP Atishi, who have been suspended from the Delhi Assembly for the day, hold protest in the Assembly premises
11 AAP MLAs, including LoP Atishi, have been suspended by Speaker Vijender Gupta. pic.twitter.com/lFlVfoM5A9
— ANI (@ANI) February 25, 2025
Also Read..
Maha Kumbh | రేపే చివరి అమృత్‌స్నానం.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్
Maha Kumbh | మహాకుంభమేళాలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా.. పారిశుద్ధ్య కార్మికుల క్లీన్ డ్రైవ్