Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరింది. రేపటితో ఈ మహాకుంభమేళా ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. ఇదే సమయంలో గిన్నిస్ రికార్డు (Guinness World Record) లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు (sanitation workers) కుంభమేళా ప్రాంతంలో క్లీన్ డ్రైవ్ (cleanliness drive) కార్యక్రమాన్ని నిర్వహించారు.
సుమారు 15,000 మంది పారిశుధ్య కార్మికులు ఇక్కడ నాలుగు జోన్లలో క్లీన్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చీపురుపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్(Guinness World Record) రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను మూడు రోజుల్లో వెల్లడించనున్నట్లు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు తెలిపారు. కాగా, 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 63 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది.
Also Read..
Earthquake | బంగాళాఖాతంలో భూకంపం.. కోల్‌కతా, భువనేశ్వర్‌ను తాకిన ప్రకంపనలు
Maharashtra | మహాయుతిలో ముదిరిన విభేదాలు.. బీజేపీ, షిండే మధ్య పెరుగుతున్న దూరం!
Russia Ukraine War | ముగింపు ఎప్పుడు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మూడేండ్లు పూర్తి