IRCTC | ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ మరోసారి డౌన్ అయ్యింది. శనివారం ఉదయం 10 గంటలకు తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది. టికెట్ బుకింగ్ విండో ఓపెన్ అయిన వెంటనే వెబ్సైట్ యాక్సెస్ ఆగిపోయింది. యాప్ సేవల్లో కూడా అంతరాయం నెలకొంది. దీనికారణంగా ఛట్ పూజ (Chhath Puja) వేళ సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు టికెట్లు బుక్చేసుకోలేకపోయారు.
డౌన్‌డెటెక్టర్ (Downdetector) ప్రకారం.. ఉదయం 10 గంటల తర్వాత వెబ్సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు రైలు టికెట్స్ బుక్ చేసుకోలేకపోయారు. పండగల వేళ ఈ అంతరాయం ఏర్పడటంతో ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఐఆర్సీటీసీ డౌన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో ఎర్రర్ వస్తోందని పేర్కొంటున్నారు. బుకింగ్ పోర్ట్‌లోకి వెళ్లగానే.. ఎర్రర్ వస్తోందని, సైట్ ప్రస్తుతం అందుబాటులో లేదని, తర్వాత ప్రయత్నించండి వంటి మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటీవలే కాలంలో తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. పండుగ సీజన్లో వెబ్సైట్, యాస్ సేవల్లో అంతరాయం ఏర్పడటం వారం రోజుల్లో ఇది రెండోసారి. దీపావళి ముందు అంటే అక్టోబర్ 17న కూడా ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
Also Read..
Chhath Puja | 36 గంటల పాటూ కఠిన ఉపవాసం.. ఛట్ పూజ ప్రత్యేకత
Doctor Suicide | మహిళా వైద్యురాలి సూసైడ్.. ఒకరు అరెస్ట్
Gas Leaked | బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీక్.. అక్కాచెల్లెళ్లు మృతి