Doctor Suicide | మహారాష్ట్ర (Maharashtra)లోని సతారా (Satara) జిల్లాలో 28 ఏండ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్య (Doctor Suicide) చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేశారు. సూసైడ్‌నోట్‌లో రాసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన ప్రశాంత్ బంకర్ (Prashant Bankar)ను ఫల్తాన్ పోలీసులు (Phaltan police) శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని పూణెలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఫల్తాన్ ఉప-జిల్లా దవాఖానలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బాధితురాలు గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఐ నిత్యం పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన చేతిపై రాసిన సూసైడ్ నోట్లో ఆమె పేర్కొన్నారు. మరో పోలీసు అధికారి ప్రశాంత్ బంకర్ కూడా తనను మానసికంగా వేధించినట్లు ఆమె తన నోట్లో ఆరోపించారు. సబ్ డివిజనల్ పోలీసు ఇన్స్పెక్టర్ పాటిల్, పోలీసు ఇన్స్పెక్టర్ లాడ్‌పుత్రే పేర్లను కూడా ప్రస్తావించారు. ఈ ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా నిందితులపై చర్యలు చేపట్టారు.
Also Read..
Gas Leaked | బాత్రూమ్లో గీజర్ నుంచి గ్యాస్ లీక్.. అక్కాచెల్లెళ్లు మృతి
Chhath Puja | 36 గంటల పాటూ కఠిన ఉపవాసం.. ఛట్ పూజ ప్రత్యేకత
Air Pollution | ఢిల్లీలో తీవ్రస్థాయిలోనే వాయు కాలుష్యం.. జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యుల సూచన